నృత్యపోటీల్లో శ్రావణికి ప్రథమ బహుమతి
శ్రీకాకుళం, జూలై 22 : శ్రీకాకుళం పట్టణంలోని శ్రీసాయి శివనృత్యనికేతన్‌కు చెందిన చిన్నారి ఎం.వి.ఎస్.శ్రావణికి నాట్యరవళి రాష్ట్రస్థాయి నృత్యపోటీల్లో సబ్ జూనియర్ విభాగం, భరత నాట్యంలో ప్రథమ బహుమతి, జనపద నృత్యంలో ప్రోత్సాహ బహుమతి పొందింది. విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో జరిగిన పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ నృత్యాంశాల్లో 725 మంది కళాకారులు పాల్గొన్నారు. గాయిత్రీ స్కూల్‌లో ఆరోతరగతి చదువుతున్న శ్రావణిని నృత్య దర్శకుడు శివకుమార్‌తో పాటు పలువురు అభినందించారు.