‘నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ చేస్తాం: ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్
గద్వాల ప్రతినిధి అక్టోబర్ 15 (జనంసాక్షి) నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ చేస్తున్నామని గద్వాల ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ భాస్కర్ తెలియజేసారు.శనివారం జిల్లా కేంద్రంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం పరిధిలో లో వాహనాల తనిఖీ నిర్వహించి నంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది అని దానితో పాటు ధృవీకరణ పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు.8 ద్విచక్ర వాహనాలు నంబర్ లేనివి వాటికి నెంబర్ వేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అని ట్రాఫిక్ ఎస్సై తెలియజేశారు .ఈ సందర్బంగా ట్రాఫిక్ ఎస్సై మాట్లాడుతూ… ఇకపై ప్రతి రోజూ వాహనాల తనిఖీ నిర్వహిస్తామన్నారు. వాహన దారులు తప్పని సరిగా రవాణా శాఖ నిబంధనలు పాటించాలన్నారు.మైనర్ లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లాలో ఆత్యాధునిక ఆటోమేటిక్ సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని, అతి వేగంగా వెళితే, రాంగ్ రూట్లో వెళ్తే, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే, త్రిబుల్ డ్రైవింగ్ వెళ్లిన మ్యాథమెటిగ్గా జరిమానాలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షతో పాటు జరిమానాలు తప్పవన్నారు. తనిఖీల్లో ట్రాఫిక్ సిబ్బంది శివకుమార్, రామకృష్ణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.