నెలనెలా పెన్షన్ల విడుదలలో జాప్యం
కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుదారుల ఎదురుచూపు
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదంటున్న అధికారులు
నిజామాబాద్,సెప్టెంబర్28 (జనంసాక్షి) : తమకు త్వరగా పింఛన్లు మంజూరు చేయాలని మండల పరిషత్ కార్యాలయాల నుంచి కలెక్టరేట్ వరకు దరఖాస్తుదారులు తిరుగుతున్నారు. గత నెలలో కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్టు ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడినా.. ఇప్పటి వరకు అమలుకు సంబంధించిన జీవోను విడుదల చేయకపోవడంతో అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగానే 57 సంవత్సరాలు నిండిన వారందరికీ మంజూరు కానున్నాయి. ప్రభుత్వ ంనుంచి నిధులు విడుదల అయిన వెంటనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని జిల్లా గ్రావిూణాబివృద్ధి అధికారి చందర్ నాయక్ తెలిపారు. కొత్త దరఖాస్తులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అర్హులను గు ర్తిస్తామని ఆయన తెలిపారు. జిల్లాలో ఓ వైపు పాత సున్షన్ల పంపిణీకి నిధుల సమస్య ఎదురవుతుండగా.. మరో వైపు కొత్తవి ఇప్పటికీ మంజూరు కాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు మంజూరు కాలేదు. ఎన్నికల సమయంలో 57 ఏళ్లు దాటిన వారందరికీ పింఛన్లు ఇస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికలు అయి దాదాపు మూడేళ్లు అవుతున్నా కొత్త పింఛన్లు మంజూరు కాలేదు. జిల్లాలో రెండు నెలల క్రితం ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో 57 సంవ త్సరాలు నిండిన వారు 47 వేలకుపైగా కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ కొత్త పింఛన్లు కో సం దరఖాస్తు చేస్తున్న వారిలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలతో పాటు చేనేత, గీత, బీడీ కార్మికులు ఉన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు ఎదురు చూస్తుంటే.. రెగ్యులర్ పెన్షన్ల పంపిణీకి నిధులు విడుదల కావడం లేదు. కొన్ని నెలలుగా ఏ నెలకు ఆ నెల నిధులు విడుదల కాకపోవడంతో ఆలస్యంగా అందుతున్నాయి. నెలాఖరున మాత్రమే వృద్ధులు, వితంతు వులు, వికలాంగుల కు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం జూలై నెల పింఛన్లను జిల్లాలో పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ప్రతినెలా వృద్ధులు, వితంతువులు, గీత, చేనేత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్, బోదకాలు బాధితులు కలిపి మొత్తం 2 లక్షల 56 వే ల 664 మందికి పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. వీరికి బ్యాంకుల ద్వారా నేరుగా వారి ఖాతాలలోనే డబ్బులను జమ చేస్తున్నారు. సెల్ ఫోన్లకు సమాచారం రాగానే పింఛన్‌దారులు బ్యాంకులకు వెళ్లి డబ్బులు తీసుకుంటున్నారు. గ్రామాలలో మాత్రం పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. పింఛన్‌దారులకు బయోమెట్రిక్ ద్వారా ప్రతినెలా పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతీ నెలాఖరులోపే నిధులను మంజూరు చేసేది. ప్రస్తుతం కరోనా, ఇతర కారణాలతో నిధుల విడుదల ఆసల్యం అవుతుండంతో పింఛన్ల పంపిణీ సకాలంలో జరగడం లేదు. జిల్లాలో ఇప్పటికే రెండు నెలల పెన్షన్ పెండిరగ్‌లోనే ఉంది. ప్రభుత్వం నిధుల కొరత ఎదుర్కొంటుండడంతో
ప్రతినెలా నిధుల విడుదల ఆలస్యమవుతోంది. కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు మండల పరిషత్ కార్యాలయాలు, కలెక్టరేట్‌కు వచ్చి తమకు త్వరగా పింఛన్ మంజూరు చేయాలని కోరుతున్నారు. కొత్తగా వచ్చిన దరఖాస్తుల పై అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అర్హులను గుర్తించి ప్రభుత్వానికి పంపించనున్నారు.