నెహ్రూ, ఎడ్వినా ప్రేమాయణంపై పుస్తకం

(జనంసాక్షి) :  ఆదిగా నానుతున్న ఎడ్వినమౌన్‌ బాటెన్‌ మాజీ, దివంగత ప్రధాని నెహ్రూల మధ్య సాగిన ఆత్మీయ సంబంధం మరోమారు తెరపైకి వచ్చింది. అనేక వివాదాలకు ఎడ్వినానే కారణమని అప్పట్లో నెహ్రూపై విమర్శలు గుప్పుమన్నాయి. 83 ఏళ్ల కురవృద్ధుడు పమేలా రాసిన ఓ పుస్తకంలో వీరి ప్రేమాయణం గురించి అక్షరరూపం ఇచ్చింది. తాత్విక చింతన పేరుతో చిగురించిన వీరి స్నేహం పడకగది వరకు వెళ్లిందన్న విమర్శలు ఆ పుస్తకంలో రావడంతో నీడలా వెంటాడుతున్న ఎడ్వినా సంబంధంపై మారోమారు చర్చకు దారి తీసింది. కాశ్మీర్‌ సమస్యతో సహ అనేక అపరిష్కఋత సమస్యలు ఆ మాయేనని అప్పట్లో అనేక మంది చెవులు కొరుక్కున్నారు. కానీ ఎవరూ సాహసం చేసి చరిత్రకు ఎక్కించే ప్రయత్నం చేయలేదు. పమేలా తన పుస్తకంలో చివరకు వీరిది తాత్విక చింతనే అని కొసమెరుపుతో ముగించినట్లు సమాచారం. పరస్పర విరుద్ధంగా ఉన్న ఈ పుస్తకంపై ఎలాంటి వివాదాలు తలెత్తుతాయో జీవించిలేని వ్యక్తులపై,. వారి వ్యక్తిగత జీవితాలపై వివాదాస్పద అంశాలను పొందుపరిచి పుస్తకాలు రాయడం సరికాదని కొందరు రచయితలు అభిప్రయాపడుతున్నారు.