నేటినుంచి బాలికల బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలు


తిరుపతి, జూన్‌ 22 (జనంసాక్షి):

అంతర్‌ రాష్ట్ర పోటీలకు చిత్తూరు జిల్లా బాలికల బ్యాడ్మింటన్‌ జట్టు ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. ఇందు కోసం 23 నుంచి 27 వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశా ల ఆవరణలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన  క్రీడాకారులను ఎంపిక చేయడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. విశాఖ జిల్లా ఎలమంచలిలో జరగనున్న 27వ అంతర్‌రాష్ట్ర బాలికల బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు కోసం వీరిని ఎంపిక చేస్తున్నారు. క్రీడాకారుల ఎంపిక ఈనెల 27న ఖరారు చేయనున్నట్లు జిల్లా అసోసియేషన్‌ నేతలు తెలిపారు.