నేటి ఆధునిక సమాజానికి వాల్మీకి చూపిన మార్గం ఎంతో ఆచరణమైనది

– ఎంపీపీ గూడెపు శ్రీనివాసు
హుజూర్ నగర్ అక్టోబర్ 9 (జనం సాక్షి): నేటి ఆధునిక సమాజానికి వాల్మీకి చూపిన మార్గం ఎంతో ఆచరణమైనదని ఎంపీపీ గూడెపు శ్రీనివాసు అన్నారు. ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ భవనంలో ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకి రామాయణాన్ని రచించి మంచి మార్గాన్ని చూపెట్టాడని అన్నారు. ఒక బోయగా జీవించిన వాల్మీకి చరిత్ర సృష్టించాడని కొనియాడారు. సమాజానికి మంచినీ నేర్పించిన గొప్ప మహనీయుడు అన్నారు. వాల్మీకి నేటి తరాలకు ఎంతో స్ఫూర్తిదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, సూపర్డెంట్ నర్సిరెడ్డి, కుందూరు విజయభాస్కర్ రెడ్డి, సారెడ్డి భాస్కర్ రెడ్డి, చంద్రకళ, ప్రసాదు, దుర్గయ్య, పాల్గొన్నారు.