నేటి నుంచి ఒక్కపూటే ఇంధన విక్రయాలు

 

ప్రోద్దుటూరు (మెయిన్‌బజార్‌): న్యూస్‌టుడే : జిల్లాలో పెట్రోల్‌ బంకులు సోమవారం నుంచి ఒక్కపూటే పనిచేస్తామని జిల్లా పెట్రోల్‌బంకు యాజమానుల సంఘ అధ్యక్షుడు వర్రాగురివిరెడ్డి తెలిపారు. అదివారం అయన తన బంకులో బంకుల యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. పెట్రోల్‌ డీజిల్‌ ధరలను చమురు సంస్థలు మాటిమాటికి పెంచినప్పటికి డీలర్ల కమిషన్‌ మాత్రం పెంచలెదన్నారు. దీంతోతమకు పెట్టుబడి వ్యయం పెరిగి నష్టాలు వస్తున్నాయని పేర్కోన్నారు.