నేటి నుంచి పెట్రోల్ బంకులు సాయంత్రం వరకే
కమీషన్ పెంచేవరకు నిరసన
కలెక్టరెట్, న్యూస్‌టుడే: పెట్రోల్ బంకులు సోమవారం నుంచి సాయంత్రం వరకు మాత్రమే నిర్వహిస్తామని, సాయంత్రం నుంచి తిరిగి ఉదయం వరకు బంద్ చేస్తామని జిల్లా పెట్రోల్ బంకుల యాజమానుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ తెలిపారు. అదివారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెట్రోల్ బంక్ డీలర్లకు సంబందించికేంద్ర ప్రభుత్వం అపూర్వచక్ర కమీటిని ఏర్పాటు చేసిందని దాని ప్రకారం ప్రతి అరు నెలలకోకసాని డీలర్ల కమీషన్ పెంచాల్సీ ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. గతంలో లీటరు పెట్రోల్ రూ. 6 ఉన్నప్పడు ఇస్తున్న కమీషన్‌నే ఇప్పడూ ఇస్తున్నారని. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 31 శాతం డీజీల్‌పై 22 శాతం వ్యాట్ విధిస్తోందన్నారు. విద్యుతుతకోతల కారణంగా జనరేటర్లతో బంకులు నిర్వహించడంతో నష్టాల బారిన పడుతున్నామని అవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్‌పై రూ .2.86, డీజిల్‌పై రూ. 1.69 కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు కమీషన్ పెంచే వరకు నిరసన కోనసాగిస్తామన్నారు.సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి