*నేటి బతుకమ్మ చీరలే రేపటి కేసీఆర్ బొంతలు*
మండల కాంగ్రెస్ పార్టీ సహాయక కార్యదర్శి పాలపాటి ప్రవీణ్ కుమార్
మునగాల, సెప్టెంబర్ 23(జనంసాక్షి): బతుకమ్మ చీరల ముసుగులో సూరత్ మిల్లు యజమానులతో ములాఖత్ అయి ప్రతి సంవత్సరం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తూ తెలంగాణా ఆడపడుచులకు గౌరభంగం కలిగించేటట్లుగా నాసిరకం చీరలు పంచుతున్నారని, ఈ నాసిరకం చీరల పంపకానికి కూడా కొన్ని కోట్ల రూపాయలు ప్రచార ప్రకటనల కోసం ఖర్చు చేస్తున్నారని, టీఆర్ఎస్ పాలనలో కేవలం కమిషన్లు వచ్చే పథకాలే పెడుతున్నారని ఇలాంటి చవక బారు పథకాలతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. మహిళలకి కావాల్సినది రక్షణ తప్ప రంగు వెలిసే చీరలు కాదని అన్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మహిళలందరు రోడ్ల మీదికి వచ్చి చీరలు అన్ని పోగేసి కాల్చుతున్న కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నాడని, నాజీ నవాబు కేసీఆర్ పాలనను రాష్ట్ర మహిళలందరు కలిసి అవే చీరలతో ఉరి వేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.