నేటి యువతరం గాంధీజీ చూపిన శాంతి మార్గంలో పయనించాలి
– జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి
హుజూర్ నగర్ అక్టోబర్ 2 (జనం సాక్షి): సత్యం, అహింస అనే మార్గం ద్వారా ఈ దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టి దేశ ప్రజల ద్వారా భారత జాతిపిత అని కీర్తించబడుతున్న మహాత్మా గాంధీ జయంతి వేడుకలను అమరవరం గ్రామపంచాయతీలో సర్పంచ్ గుజ్జుల సుజాత అంజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగిందన్నారు. ఆదివారం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హుజూర్ నగర్ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి హాజరై మహాత్ముని చిత్రపటానికి సర్పంచ్ తో కలసి పూలమాల వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కెసిఆర్ గాంధీజీ చూపిన అహింస మార్గంలో ప్రయాణించి వారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు. అనంతరం గ్రామ సీమలే దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలు అని మహాత్ముడు అన్నారు. అందుకే వారు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఇవాళ గ్రామాలన్నీ పరిశుభ్రత పచ్చదనంతో కళకళలాడుతున్నాయన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించారన్నారు. దీంతో గ్రామాల రూపురేఖలే మారిపోయాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దూబ బాల సైదులు, వార్డు సభ్యులు సామల మట్టారెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కార్యదర్శి షేక్ సైదులు, ఆశ వర్కర్లు స్నేహలత, స్వరూప, ధనమ్మ, గ్రామ ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.