నేటి సమాజంలో సీసీ కెమెరాలదే కీలక పాత్ర
-చేర్యాల సీఐ మంచినీళ్ల శ్రీనివాస్
ధూల్మిట్ట (జనంసాక్షి) ఆగస్టు 27 : నేటి సమాజంలో సీసీ కెమెరాలదే కీలక పాత్ర అని చేర్యాల సీఐ మంచినీళ్ల శ్రీనివాస్ అన్నారు. శనివారం ధూళిమిట్ట మండలంలోని తోర్నాల గ్రామంలో సీసీ కెమెరాలను స్థానిక సర్పంచ్ తాళ్లపల్లి రాజమ్మతో కలిసి ప్రారంభించారు. ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ. గ్రామం నిఘా నేత్రం నీడలో ఉండడం పోలీసులకు, గ్రామ పంచాయతీ పాలకవర్గానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడం సులభం అవుతుందని అన్నారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న గ్రామస్థులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్ ల ఆధ్వర్యంలో చేర్యాల సీఐ శ్రీనివాస్, మద్దూరు ఎస్సై అన్నబోయిన నారాయణ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పరుశరాములు, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ సీ.ఏ, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.