నేడు ఎస్సై ప్రాథమిక పరీక్ష కు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు.

ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి.కోడేరు.

కోడేరు (జనంసాక్షి) నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల ఎస్ఐ ప్రాథమిక పరిక్షలకు హాజరు అయ్యే అభ్యర్థులకు కోడేరు ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి సూచనలు సలహాలు ఇచ్చారు.తమ తమ హాల్ టిక్కెట్లు నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని, దానిపై కింద ఎడమవైపు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించవలేను. గజేట్డ్ అధికారి సంతకము అవసరం లేదు.
వీలైతే ఒక రోజు ముందే ఎగ్జాం సెంటర్ చూసుకుంటే మంచిది.
– ఎగ్జామ్ నకు వచ్చేటపుడు హాల్ టిక్కెట్, ఫోటో, పెన్ మాత్రం తెచుకొనవలేను. రైటింగ్ ప్యాడ్ తెచ్చుకున్న సరే లేకున్నా సరే.
-సెల్ఫోన్, వాచ్, క్యాలుకులేటర్, బ్యాగు, గొడుగు పరీక్ష సెంటర్ కు తేవద్దు, అవి పెట్టుకొనుటకు ఎలాంటి సౌకర్యం లేదు, బయట ఎక్కడైనా పెట్టుకోని రావలెను.
– అభ్యర్థుల వాహనాలు సెంటర్ బయట పెట్టుకొన వలెను, అందుకు పోలీసువారు సహకరించుతారు.
– పరీక్ష కేంద్రానికి తొమ్మిది గంటలకంటే ముందే చేరుకుంటే మంచిది మరియు పరీక్ష కేంద్రం తమదని నిర్ధారించుకుంటే మంచిది.
– ఉదయం 9 గంటలనుండి లోపలికి అనుమతిస్తారు. 10 గంటలకు గేటు మూసేస్తారు, ఒక నిముషం ఆలస్యమైనా అనుమతి లేదు
– మధ్యాహ్నం 1 గంట వరకు కూర్చుని వుండాలి.పరిక్షా పూర్తి అయినంతవరకు బయటకు పంపరు.
– అందరికీ బయోమెట్రిక్ వేలిముద్రలు తీస్తారు.
మాల్ ప్రాక్టీస్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకొన బడును.నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ వారి ఆదేశానుసారం
జారీ చేసినది, గా ఎస్సై కోడేరు తెలిపారు.