నేడు కానిస్టేబుల్ పరిక్ష రాసె యువతకు సూచనలు

  దోమ SI విశ్వజన్.
దోమ ఆగష్టు 27 (జనం సాక్షి)
కానిస్టేబుల్‌ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. అభ్యర్థులు నిర్ణీత సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతి లభించదని స్పష్టం చేశారు. ఆదివారం జరగనున్న ఈ పరీక్ష కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1601 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 6,61,196 మంది పరీక్ష ను రాయనున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఇంత భారీ ఎత్తున కానిస్టేబుళ్ల నియామకాలు కోసం పరీక్ష జరుగుతోంది.
*అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే..*
-కోవిడ్ 19 నేపథ్యంలో మాస్క్ లను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.
-హాల్ టికెట్స్ ను ఏ4 సైజ్ పేపర్ లోనే డౌన్ లోడ్ చేసుకుకోవాలి.
-అనంతరం అందులో నిర్ధేషించిన స్థలంలో అభ్యర్థి ఫొటోను గమ్ తో అంతికించుకోవాలి.
-దరఖాస్తు సమయంలో డిజిటల్ కాపీలో ఉంచిన ఫొటోనే తిరిగి వినియోగించాలి. ఫొటోలపై పిన్ కొట్టొద్దు. ఇలా చేస్తే పరీక్ష హాల్లోకి అనుమతి ఉండదు.
-చేతులకు మెహందీ, టాటూలు ఉంచకోకూడదు.
-హాల్లోకి హాల్ టికెట్స్ తో పాటు.. బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ ను మాత్రమే తీసుకెళ్లాలి.
-మహిళా అభ్యర్థులు నగదు ధరించకూడదు. విలువైన వస్తువుల్ని భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రాల్లో క్లొక్ రూం సదుపాయం ఉండదు.
-ఓఎమ్ ఆర్ షీట్లపై అనవసర రాతలు, గుర్తులు, మతసంబంధ అంశాల్లాంటివి రాస్తే మాల్ ప్రాక్టీస్ గా పరిగణిస్తారని హాల్ టికెట్స్ లో పేర్కొన్న నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.