నేడు కేంద్ర కేబినేట్ విస్తరణ
ఢిల్లీ: ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కేంద్ర కేబినేట్ విస్తరణకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 11.30 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముందుగా ఉహించినట్టే భారీస్థాయిలో మార్పులు, చేర్పులు చేపట్టనున్నారు. 12 మంది కొత్త వారికి మంత్రివర్గంలో అవకాశం లభించనుంది. మరో 12 మందికి సహాయ మంత్రి హోదా నుంచి పదోన్నతి లభించనుంది. కాంగ్రెస్ యువరాజు రాహుల్‌గాంధీ మాత్రం ప్రభుత్వంలో చేరే అవకాశం లేదు. ఆయన పార్టీలో పెద్ద పాత్ర పోషించనున్నారని, రాహుల్‌ను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేయవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికలను ముందు ఇదే చివరి పునర్వ్యవస్థీకరణగా భావిస్తున్న నేపథ్యంలో యూపీఏ కేబినేట్‌లో పూర్తిస్థాయిలో మార్పులు, చేర్పులు జరగనున్నాయి. రాష్ట్రం నుంచి ఐదుగురికి కేంద్రం కేబినేట్‌లో చోటు దక్కింది. చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, బలరాంనాయక్, సర్వే సత్యనారాయణ, కిల్లి కృపారాణిలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.