నేడు ఖమ్మం పర్యటనకు మంత్రి కెటిఆర్‌


పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం
భారీగా ఏర్పాట్లు చేస్తున్న టిఆర్‌ఎస్‌ శ్రేణులు
ఖమ్మం,జూన్‌10(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లాలో మంత్రి కెటిఆర్‌ శనివారం పర్యటించనున్నారు. ఈ మేరకు
మంత్రి జిల్లా పర్యటన అధికారికంగా ఖరారైంది. ఆయన శనివారం పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుడతారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌తో కలిసి ఖమ్మం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి రూ.86కోట్లకుపైగా నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 8గంటలకు మంత్రులు కేటీఆర్‌, పువ్వాడతో పాటు పలులురు నేతలు, ప్రజాప్రతినిధులు హెలికాప్టర్‌లో ఖమ్మం చేరుకుని ఖమ్మం మమతా ఆసుపత్రి గ్రౌండ్‌కు చేరుకుంటారు. అనంతరం లకారం ట్యాంక్‌బండ్‌పై సస్పెన్షన్‌ కేబుల్‌బ్రిడ్జి,మ్యూజికల్‌లైటింగ్‌, రఘునాథపాలెంలో సుడా ఆధ్వర్యంలో నిర్మించిన బృహత ప్లలెప్రకృతివనం, ఖమ్మం టేకులపల్లిలో కేసీఆర్‌ టవర్స్‌లో నిర్మించిన 240 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, తెలంగాణ క్రీడాప్రాంగణాన్ని పార్రంభింస్తారు. ఆతర్వాత 10:45గంటలకు సర్దార్‌పటేల్‌స్టేడియంలో జరిగే పట్టణ ప్రగతి బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం పాతమునిసిపల్‌భవనలో సిటీలైబ్రరీని, ప్రభుత్వాసుపత్రి వద్ద అధునాతనంగా నిర్మించిన ఫుట్‌పాతప్రాజెక్టు, గట్టయ్య సెంటర్‌లోని కొత్త కార్పొరేషన్‌ భవనం, దానవాయిగూడెంలో మానవవ్యర్థాల శుద్ధి కర్మాగారాన్ని, ప్రకా?షనగర్‌లో వైకుంఠధామాన్ని ప్రారంభిస్తారు. అక్కడే మురికినీటిశుద్ధి కర్మాగారానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత ధంసలాపురంలో కార్పొరేషన నర్సరీని ప్రారంభిస్తారు. అనంతరం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో భోజనం చేసి 3గంటలకు హైదరాబాద్‌ తిరుగు పయనమవుతారు. మంత్రి కేటీఆర్‌ పర్యటన అధికారికంగా ఖరారవడంతో ఇటు గులాబీ శ్రేణులు, అటు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సర్దార్‌పటేల్‌స్టేడియంలో బహిరంగసభ ద్వారా రాబోయే ఎన్నికలకు సిద్ధమన్న సంకేతాలు పంపనున్నారు. బహిరంగసభ జయప్రదం చేసేందుకు జనసవిూకరణపై దృష్టిసారించారు. కేటీఆర్‌ రాక సందర్భంగా ఇల్లెందుక్రాస్‌రోడ్‌, ఎన్టీఆర్‌ సర్కిల్‌, మమతా సర్కిల్‌తోపాటు ఖమ్మం నగరంలో పలుచోట్ల గులాబీతోరణాలతో అలంకరించారు. ప్లెక్సీలు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. అయితే గతంలో రెండుసార్లు కేటీఆర్‌ పర్యటన ఖరారై వాయిదా పడడంతో ఈ సారి కచ్చితంగా పర్యటన జరుగుతుందని, ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు కృషిచేస్తున్నారు. ఖమ్మంనగర, రఘునాథపాలెం మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పర్యటన, బహిరంగసభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.