నేడు జిలల్లాకు రానున్న సిఎం కెసిఆర్‌

klpfrb87
అధికారులతో సవిూక్షలో నిజామాబాద్‌కు వరాలు?
నిజామాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండురోజుల పాటు జిల్లాలోనే మకాం వేయనున్నందున సవిూక్షలకు సంబంధించి జిల్లా అధికారులు సన్నద్దం అవుతున్నారు. జిల్లా సమస్యలతో పాటు నిధులకు సంబంధించి వివరాలను సిద్దం చేసుకుంటున్నారు. అలాగే సిఎం కూడా జిల్లాకు సంబంధించి గత వాగ్దానాలకు తోడు తాజాగా వివిధ అంశాలపై ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందుకు అనుగుణంగా వివిధ అంశాలపై సిఎంతో చర్చించనున్నారు. శుక్ర,శనివారాల్లో సిఎం ఇక్కడే మకాం వేస్తారు. పర్యటనలో భాగంగా జిల్లా అధికారులతో సవిూక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ సమావేశానికి జిల్లా పరిషత్‌ను వేదిక కానుంది.  ముఖ్యమంత్రితో పాటు అధికారులు కూడా రానున్నారు. పనులను జడ్పీ ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు, సీఈవో మోహన్‌లాల్‌  పర్యవేక్షించారు. ఇకసోతే కేసీఆర్‌ రెండ్రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వస్తుండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి గత మూడ్రోజులుగా ఇదే పనిగా బిజీలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏప్రిల్‌ 1న జిల్లాకు రోడ్డుమార్గంలో రానున్నారు. తిరిగి 2 తేదీన రోడ్డు మార్గంలోనే మెదక్‌ జిల్లాకు వెళ్తారు. సిఎం పర్యటించే అన్ని ప్రాంతాలను 24 గంటలు ముందుగానే పోలీసులు తమ ఆధీనంలోనికి తీసుకున్నారు. ప్రైవేటు వ్యక్తులెవరూ ఆ ప్రాంతాల్లోకి వెళ్లకుండా నిషేధం

విధించారు. ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండేందుకు నిఘా విభాగం అధికారులు ప్రజా సంఘాలు, ఆయా పార్టీల నేతలపై దృష్టి పెట్టారు. సీఎం పర్యటన ముగిసేవరకు జిల్లాలో సివిల్‌, ఏఆర్‌ పోలీసు సిబ్బందికి బందోబస్తు బాధ్యతలు కట్టబెట్టారు.  నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగే సమావేశంలో అన్ని శాఖల పనితీరుపై సవిూక్షిస్తారు. ఏప్రిల్‌ 2న బీర్కూర్‌ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు వస్తున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత శాఖాధికారులకు జిల్లా కలెక్టర్‌ యోగితారాణా ఆదేశించారు.కొండపై సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.  యాగశాల వద్ద సీఎం కేసీఆర్‌ నిర్వహించే సుదర్శన యాగం ఏర్పాట్లను పరిశీలించారు.  సాధారణ వాహనాలు కొండ వైపునకు రాకుండా తిమ్మాపూర్‌ వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేయాలన్నారు. కొండ కింద భాగాన ముఖ్య అతిథులకు వాహనాలు నిలిపేందుకు స్థలాన్ని కేటాయించాలని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి స్థానిక పోలీసులకు ఆదేశించారు. సీఎం భక్తులనుద్దేశించి మాట్లాడే కార్యక్రమాన్ని కొండ కింద భాగాన ఏర్పాటు చేస్తున్న భారీ తెర ద్వారా ప్రజలు వీక్షించేలా సదుపాయం కల్పిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు ఎస్పీకి తెలియజేశారు. అలాగే మాక్లూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.  నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణెళిశ్‌ గుప్తా తన సొంతూరైన మండల కేంద్రమైన మాక్లూర్‌లో ఇటీవల ఇంటిని నిర్మించారు. ఆయన ఆహ్వానం మేరకు ఏప్రిల్‌ 1న కేసీఆర్‌ మాక్లూర్‌ రానున్నారు. నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరవుతారు. భద్రత, ట్రాఫిక్‌ పరమైన సమస్యలు తలెత్తకుండా ఏం చేయాలనే విషయమై సుదీర్ఘంగా చర్చించారు. 1న మాక్లూర్‌కు ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రముఖులు రానున్నందున పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.