నేడు ఢిల్లీకి కిరణ్, బొత్స తెలంగాణే ప్రధానం
న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి):
రాష్ట్ర రాజకీయాల నుంచి కాంగ్రెస్ అధిష్టానం దృష్టి మరల్చలేదు. ఈ నేపథ్యంలో సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సను శుక్రవారం ఢిల్లీ రావాలని పిలిపించింది.ఇతర అంశాలు ఉన్నప్పటికి తెలంగాణ ప్రధానంగా చర్చిస్తారని తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికల కోసం మరో సారి వ్యూహరచన చేయాల్సి ఉంటుందని వారికి సమాచారం ఇచ్చినా.. ఇతరత్రా అనేక ఆంశాల వారితో చర్చించే అవకాశాలున్నాయి. మంగళవారం ఢిల్లీకి వచ్చిన బొత్స సత్యన ారాయణ తాను వ్యక్తిగతపనిపై వచ్చినట్లు చెప్పారు. కానీ తన సమీప బందువు మరణించడంతో ఆయన బుధవారం ఉదయమే విజయనగరం తిరిగి వెళ్లారు. శుక్రవారమే ఆయన సీఎంతో పాటు మళ్లీ ఢిల్లీ రానున్నారు. ఎన్నికల్లో పరాజయం చెందినా రాష్ట్ర కాంగ్రెస్ లో స్తబ్ధత తొలగిపోనందుకు పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఏర్పడనందుకు అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంపై బొత్సను పార్టీ రా్ట వ్యవహారాల ఇన్‌చార్జీ ఆజాద్ ప్రశ్నించినట్లు కూడా తెలుస్తోంది.
19 న హైదరబాద్‌కు రండి ..రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో 19న హైదరాబాద్‌కు రావాల్సిందిగా కాగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను సీఎల్పీ కోరింది. ఈ మేరకు సీఎల్పీ కార్యాలయం నుంచి సభ్యులందరికీ సమాచారం చేరింది. అయితే ఈ సమయంలో పలువురు ఎమ్మెల్యేలు యశాసన సభ సమావేశాలను గురించి ఆరాతీశారు. కానీ ఆ విషయం తమకు తెలియదని, 19 న హైదరాబాద్‌కు వచ్చి రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిబోటింగ్‌లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు