నేడు ధర్మపురిలో గొర్రెల పెంపకందారుల సభ
జగిత్యాల,అక్టోబర్10(జనంసాక్షి): గొల్లకురుమల సంక్షేమం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతోనే ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని గొర్రెల పెంపకందారుల యూనియన్ జిల్లా డైరెక్టర్ పలుమారు మల్లేశ్‌యాదవ్ పేర్కొన్నారు. నియోజకవర్గ స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞత సభను ఈ నెల 11న ధర్మపురిలోని రాజరాజేశ్వర ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి టిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోనే మొదటి సారిగా తెలంగాణలో గొల్లకురుమలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రత్యేక దృష్టితో తమ సంఘాలను అధ్యయనం చేసిన కేసీఆర్ పలు సమస్యలను గుర్తించి 75 శాతం రాయితీపై గొర్రెల యూనిట్లు పంపిణీ చేశారని అన్నారు. అలాగే వాటి ఆరోగ్య రక్షణకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 100 సంచార అంబులెన్స్‌ప్రవేశపెట్టిన ఘనత టీఆర్‌ఎస్ సర్కారుదేనన్నారు. 1962 టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేసి ఫో న్ చేసిన అరగంటలోపు వచ్చి వైద్యం చేసేలా చర్యలు చేపట్టారన్నారు. ఉపాధిహామి పథకం ద్వారా రూ.98వేల విలువతో షెడ్లు నిర్మించి ఇచ్చారని చెప్పారు. నియోజకవర్గంలో కులసంఘాల భవనాలకు నిధులు మంజూరు చేసిన కొప్పులకు కృతజ్ఞతలు తెలిపారు. సభకు కులబాంధువులు భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు.