నేడు నగరంలో మరోమారు కెటిఆర్‌ ప్రచారం

హైదరాబాద్‌,డిసెంబర3(జ‌నంసాక్షి ): మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారంలో జంటనగరాలపై మరోమారు దృష్టి సారించారు. ఇక్కడ పదహారు సీట్లు గెలుచుకుంటామని చెబుతున్న కెటిఆర్‌ మరోమారు  ఉధృతంగా ప్రచారంచేయబోతున్నారు.  ప్రచారం కొనసాగింపులో భాగంగా మంత్రి మంగళవారం జంట నగరాల్లోని పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. మంత్రి కేటీఆర్‌ మంగళవారం పలు నియోజకవర్గాల్లో రోడ్‌ షోలో పాల్గొని అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు. ముషీరాబాద్‌ అభ్యర్థి ముఠా గోపాల్‌, అంబర్‌పేట కాలేరు వెంకటేశ్‌, మలక్‌పేట అభ్యర్థి చవ్వా సతీష్‌కుమార్‌, నాంపల్లి ఆనంద్‌కుమార్‌ గౌడ్‌ తరపున మంత్రి కేటీఆర్‌ ప్రచారం చేయనున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో ఆరు చోట్ల మంత్రి కేటీఆర్‌ ప్రసంగించనున్నారు. ఇప్టపికే వివిధ ప్రాంతా/-లలో ప్రచారం నిర్వహించి కూటమి నేతల వ ఇమర్శలను తిప్పికొట్టారు.