నేడు నోబెల్‌ బహుమతుల ప్రదానం

ఓస్లో : వైద్యం, సైన్సు, సాహిత్యం, ఆర్థిక శాస్త్రం లాంటి కీలక రంగాల్లో నిపుణులు కలలు కనే ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కారం ప్రదానం జరిగేది ఈ నెలలోనే. డిసెంబర్‌ నెల తొలి పది రోజులూ స్కాండినేవియన్‌ దేశాలైన నార్వే. స్వీడన్‌ల్లో నోబెల్‌ బహుమతి ప్రదానానికి సంబంధించిన కార్యక్రమాల సందడి కనిపిస్తుంది. డిసెంబర్‌ 10న స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోంలో రాజు కార్ల్‌ గుస్తావ్‌ చేతులనేడు నోబుల్‌ బహుమతుల ..

మీదుగా ఈ ఏటి నోబెల్‌ బహుమతి విజేతలు తమ బహుమతులు అందుకుంటారు. నోబెల్‌ శాంతి బహుమతి కూడా ఇదే రోజున నార్వే రాజధాని ఓస్లోలో నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ చైర్మన్‌ ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమానికి రాజు హరాల్డ్‌ -5 హాజరవుతారు. ఈ నేపథ్యంలో నోబెల్‌ బహుమతి గురించి మరిన్ని ముఖ్యాంశాలు

డిసెంబర్‌ 10నే ఎందుకంటే

నోబెల్‌ బహుమతి ప్రదానం ఏటా డిసెంబర్‌ 10నే ఎందుకు చేస్తారంటే ఈరోజు ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతి. 1901 నుంచి నోబెల్‌ బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని స్టాక్‌హోం కాన్సర్ట్‌ హాల్‌లో నిర్వహిస్తున్నారు. శాంతి బహుమతిని ఓస్లో సిటీ హాలులో ప్రదానం చేస్తారు. ఒక్కో విజేతకు ప్రత్యేకంగా నోబెల్‌ పతకం ( దీనికి ఒకవైపున నోబెల్‌ చిత్రం. మరోపక్కన ఆయా రంగాలకు సంబంధించిన ప్రత్యేకమైన లోగో ముద్రించి ఉంటుంది) నోబెల్‌ డిప్లొమా ( విజేత కృషిని తెలుపుతూ నోబెల్‌ కమిటీ రాసిన నోట్‌ ) నగదు బహుమతి అందజేస్తారు.

ఒక్కో హాలులో ఒక్కో ఉపన్యాసం

నోబెల్‌ బహుమతి గ్రహీతలు ఉపన్యాసాలు ఈ బహుమతి ప్రదాన కార్యక్రంలో మరో ప్రధాన ఘట్టం. శాంతి బహుమతి గ్రహీత ప్రసంగం బహుమతి అందుకునే సమయంలోనే ఉంటుంది. స్టాక్‌హోమ్‌లో ఇతర బహుమతి గ్రహీతల ప్రసంగాలు ముందుగానే పూర్తవుతాయి. ఒక్కో రంగంలో బహుమతి పొందినవారు ఉపన్యసించడానికి ఒక్కో ప్రత్యేకమైన హాలు ఉంటుంది.

ఇప్పటివరకు 555

1901 నుంచి ఈ ఏడాది వరకు మొత్తం 555 నోబెల్‌ బహుమతులు ఇచ్చినట్లు నోబెల్‌ విజేతల సంఖ్య 963 ( ఒక బహుమతిని ముగ్గురికన్నా ఎక్కువ మందికి పంచకూడదన్నది నియమం. ఇప్పటివరకు 24 సంస్థలు నోబెల్‌ బహుమతి గెలుచుకున్నాయి. నూట పన్నెండేళ్ల నోబెల్‌ బహుమతుల చరిత్రలో విజేతలైన మహిళల సంఖ్య 44 మాత్రమే. భౌతిక, రసాయన శాస్త్రాల్లో నోబెల్‌ గెలుచుకుని మేరీక్యూరీ రెండుసార్లు ఈ ప్రతిష్టాత్మక బహుమతి పొందిన ఘనత సాధించారు. క్యూరీ కుమార్తె, అల్లుడు కూడా నోబెల్‌ బహుమతి గ్రహీతలే. ఒక కుటుంబంలో ముగ్గురు నోబెల్‌ గ్రహీతలున్న ప్రత్యేకత కూడా వారికే సొంతం.