నేడు ఫ్రీడమ్ రన్

జిల్లా కలెక్టర్
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఫ్రీడం రన్ ఏర్పాటు చేసిన్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 11 వ తేదీన ( గురువారం) ఉదయం 06.30 గంటలకు భువనగిరి జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ చౌరస్తా నుండి ఫ్రీడం రన్ కార్యక్రమం జరుగుతుందని , ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినీధులు, ఉద్యోగస్తులు, యువతి యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్ని ఫ్రీడం రన్ కార్యక్రమాని విజయవంతం చేయవాల్సిందిగా కలెక్టర్ అట్టి ప్రకటనలో కోరారు.
స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జిల్లాలో ఫ్రీడం కప్ క్రీడా పోటీలను జిల్లా క్రీడల మరియు యువజన శాఖ ఆధ్వర్యంలో కబడ్డీ, ఖోఖో, వాలీ బాల్, లాంగ్ జంప్, టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడలు నిర్వహించడం జరుగుతుందని క్రీడా పోటీలు గ్రామ/ వార్డు స్థాయి , మండల/ మున్సిపాలిటీ స్థాయి , జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని, ఈ క్రీడలకు గ్రామ/ వార్డు స్థాయిలో పంచాయితీ సెక్రటరీలు, మండల/ మున్సిపాలిటీ స్థాయిలో మండల పరిషత్ అధికారి, జిల్లా స్థాయిలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారని ఆమె తెలిపారు. ఈ నెల 11 , 12 వ తేదీలలో గ్రామ/ వార్డు స్థాయిలో , 13,14 తేదీలలో మండల/ మున్సిపాలిటీ స్థాయిలో, 16,17 తేదీలలో జిల్లా స్థాయిలో క్రీడలు నిర్వహించడం జరుగుతుందని , ఈ క్రీడలలో ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, యువతి యువకులు, ప్రజలు అందరూ పాల్గొనవచ్చునని క్రీడల్లో గెల్పోందిన విజేతలకు 18వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఫ్రీడం కప్ కార్యక్రమం ఉంటుందని ఆమె తెలిపారు. 11వ తేదీన ఉదయం 6.30 గంటలకు భువనగిరి జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ చౌరస్తా నుండి ఫ్రీడం రన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ప్రజాప్రతినిధులు, యువతి యువకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు.

 

తాజావార్తలు