నేడు మద్దూర్ మండలంలో ఎమ్మెల్యే పర్యటన.

మద్దూర్ (జనంసాక్షి): నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో 10-08-2022 రోజు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటిస్తారని మండల అధ్యక్షులు వెంకటయ్య ఒక ప్రకటన తెలిపారు.
1)మధ్యాహ్నం 02-00 గంటలకు మద్దూర్ మండల్ తిమ్మారెడ్డి పల్లి బావాజీ దేవాలయ పూజారి శ్రీ రాములు నాయక్ గారి కుటుంబాన్ని మరియు కాన్పులో చనిపోయిన కృష్ణవేణి కుటుంబాన్ని పరామర్శిస్తారని అన్నారు.
2) మధ్యాహ్నం 03-00 గంటలకు మద్దూర్ మండల కేంద్రంలోని నూతన ఆసుపత్రిని పర్యవేక్షిస్తారు..
కావున ఇట్టి కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్లు పిఎసిఎస్ చైర్మన్లు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అందరు గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు మండల నాయకులు మరియు అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు తప్పకుండా పాల్గొనాలని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటయ్య కోరారు.