నేడు సిరిసిల్లలో జరిగే రేవంత్‌రెడ్డి సభను విజయవంతం చేయండి
ఎల్లారెడ్డిపేట (జనంసాక్షి) నవంబర్ 25 :ఈ నెల 26వ తేదిన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రచారసభ జరుగుతుందని ఈ సభను విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ అద్యక్షుడు దొమ్మాట నర్సయ్య కోరారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో నర్సయ్య మాట్లాడుతూ సిరిసిల్లలో ఈ నెల 20న పర్యటించిన ఆపదర్మముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే మళ్ళీ హామీలు ఇచ్చి ప్రజలకు మాయమాటలు చెప్పడం జరిగిందని కెసిఆర్ మాటలను నమ్మి మోసపోయి కారుగుర్తుకు ఓటు వేయద్దని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను, మహిళా సంఘాల మహిళలను బలవంతంగా బెదిరించి సభకు స్థానిక నాయకులు తరలించడం జరిగిందన్నారు. అదే విధంగా ద్విచక్రవాహనాలలో పెట్రోల్‌పోసి ఒక్కొక్కరికి రెండువందల రూపాయాలు ఇచ్చి సభకు తరలించారన్నారు. ప్రజలు డబ్బును టిఆర్‌ఎస్‌నుండి తీసుకొని ప్రజలను మోసం చేస్తున్న కారుగుర్తుకు ఓటు వేయకుండా చేయిగుర్తుకు ఓటువేసి కెకె మహేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. తెలంగాణ టైగర్ రేవంతర్‌రెడ్డి సభకు భారీసంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు స్వఛ్ఛందంగా తరలివస్తారని దాదాపు ఎనిమిదివేల మంది ఎల్లారెడ్డిపేట మండలంనుండే రావడానికి సిద్దంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాల కారగ్రెస్ అధికార ప్రతినిది బుగ్గ కృష్ణమూర్తిశర్మ, ఉపాద్యక్షులు షేక్ గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, వివిధ గ్రామశాఖ అద్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.