నేలరాలిన అల్లికవి శంకర్
రుద్రంగి ఆగస్టు 28 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలో ఆదివారం ప్రముఖ కవి మరియు ఉపాధ్యాయుడు అల్లే శంకర్ మృతి మండలంలోని పలువురికి తీరని లోటు ఈయన మండలంలో గల పలు ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తూ వృత్తిని కొనసాగిస్తున్న తరుణంలో ప్రవృత్తిగా కవిగా అనేక కవితలను పుస్తక ముద్రిత రూపంలో మండల తెలంగాణ ప్రజలకు అందజేయడం జరిగింది ఆయన కవితల్లో ముఖ్యంగా కోతి గీతాలు వెలుగులోకి వచ్చాయి ఆయన మండలంలో అనేక ఉద్యమాల్లో పాలుపచుకొని తన ప్రైవేటు ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి పలువురు వేలాది విద్యార్థులను తీర్చిదిద్దారు. వారికి మండలంలోని పూర్వ విద్యార్థులు తోటి సహోదర ఉపాధ్యాయులు ఘన నివాళులు అర్పించారు.