“నేలా కూలిన విద్యుత్ స్తంభం
.
పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు”
పెన్ పహాడ్. సెప్టెంబర్ 09 (జనం సాక్షి) : :మండల పరిధిలోని దుబ్బతండా గ్రామంలో నేలా కూలిన విద్యుత్ స్తంభం గత మూడు రోజుల నుండి అంధకారం నెలకొన్నది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని 2వ వార్డులో శిథిలావస్థలో ఉన్న చెట్టు కూలి విద్యుత్తు స్తంభంపై పడడంతో విద్యుత్తు స్తంభం రెండు ముక్కలుగా విరిగి పడగా గమనించిన గ్రామస్థులు అప్రమత్తమై విద్యుత్తు సరఫరా నిలిపి వేయడంతో పెను ప్రమాదం తప్పింది వెంటనే విద్యుత్తు అధికారులకు,స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేసినప్పటికి పట్టించుకోవడం లేదని దింతో గ్రామంలో అంధకారం దాపురించిందని విపరీతంగా దోమలు ఉండడంతో రాత్రి వేళల్లో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోని సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు..