నేషనల్ పంచాయతీ అవార్డు కోసం తప్పుడు డేటా నమోదు చేయవద్దు

-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 22 (జనం సాక్షి);నేషనల్ పంచాయతి అవార్డ్స్ కోసం ఎక్కడ కూడా తప్పుడు డేటా నమోదు చేయరాదని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.  శనివారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు  ఎం పి డి ఓ లు, డిపి ఓ లతో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ జిల్లా లో అమలవుతున్న స్కీమ్స్  ఉన్న దాని కంటే తక్కువ  నమోదు  చేయరాదని, ప్రతి గ్రామ పంచాయతి లో డేటా నమోదు అయ్యేటట్లు చూడాలన్నారు. నేషనల్ అవార్డ్స్ కోసం జిల్లా, మండలం ,గ్రామ పంచాయతి  పరిదిలో వారు ఇచ్చిన తీమ్స్ అన్ని పిలప్ చేసి  ఎం పి డి ఓ ,ఎం పి ఓ ల సంతకాలతో  పంపించాలని,గ్రామ పంచాయతి వారిగా ఎం పి డి ఓ లు  చెక్ చేసి కామెంట్ సెక్షన్ చూసి . సంబందిత శాఖ ల వారిగా పంపించాల్సి ఉంటుందని  తెలిపారు.  హెల్త్ పంచాయతి, చైల్డ్ డేటా , తీమ్స్ వారిగా  కరెక్ట్ డేటా ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా లో  క్రీడా ప్రాంగణలు 274  గాను 253 పూర్తీ అయినవని,మిగతా వాటిని కూడా పూర్తి చేయాలనీ , ఏర్పాటు చేయని చోట  గ్రామ సర్పంచు, గ్రామ పెద్దలతో మాట్లాడి   క్రీడా ప్రాంగాణాలు ఏర్పాటు చేయాలనీ  తెలిపారు.ఈ సమావేశం లో  జాడ్ పి సి ఇ ఓ విజయనయాక్, డి పి ఓ శ్యాం సుందర్,డి ఆర్ డి ఏ నాగేంద్రం, జిల్లా  వైద్యాదికారి చందు నాయక్,ముసాయిదా బేగం అన్ని మండలాల ఎం పి డి ఓ లు, సంబందిత అధికారులు  తదితరులు పాల్గొన్నారు.