న్యాయం కోసం లాయర్‌ భార్య ఆందోళన

భర్త ఇంటి ముందే బైఠాయింపు

గెంటేసిన అత్తామామ, భర్త

కరీంనగర్‌,అక్టోబర్‌ 23(జ‌నంసాక్షి): తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ తన భర్త ఇంటి ముందు బైటాయించింది. తనకు తెలియకుండా మరో మహిళతో సంసారం చేస్తున్నాడని తెలుసుకున్న మహిళ భర్త నగరానికి చెందిన న్యాయవాది ఎస్‌వీఆర్‌ కృష్ణ ఇంటిముందు బైటాయించగా అత్తమామ, భర్త దాడి చేయడంతో ఉద్రిక్తంగా మారింది. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ కొమురం బీం జిల్లాకు చెందిన స్రవంతికి కరీనగర్‌లో నివాసం ఉంటున్న ఎస్‌వీఈఆర్‌ కృష్ణతో 2012లో వివాహం జరిగింది,. అమ్మాయి పుట్టిందనే కారణంతో తమకు ఒక్కగానొక్క కొడుకని అత్తామామ అదనపు కట్నం తేవాలని వేధిందింపులకు గురి చేశారు. వీరికి భర్త కూడా తొడవ్వడంతో ఇక్కట్లకు గురైంది. స్రవంతి తండ్రి పలుమార్లు అల్లుడిని సముదాయించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. గొడవలు ప్రారంభం కావడంతో స్రవంతి భర్త క్రిష్ణ, అత్తమామలపై కేసు నమోదు చేసింది అనంతరం స్రవంతి కొద్ది రోజులుగా తల్లిగారింటిలోనే ఉంటుంది. ఈమద్య కాలంలో కృష్ణ గతంలో పుణెళిలో పనిచేసే సాప్ట్‌ వేర్‌ ఉద్యోగానికి ఎగనామం పెట్టి జూనియర్‌ అడ్వకేట్‌గా కరీంనగర్‌లోనే ప్రాక్టీస్‌ ప్రారంభించారు. ఈకేసు కోర్టులో నడుస్తుంది. క్రిష్ణ మరో మహిళతో సంసారం చేస్తున్నాడని తెలుసుకుని సోమవారం ఉదయం అత్తగారింటికి వెల్లింది. అయితే భర్త కృష్ణ ఆమెను ససేమిరా అనడంతో ఇంటిమందు బైఠాయించేందుకు ప్రయత్నించింది. దీంతో అత్తామామ, భర్త బౌతికంగా దాడికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈవిషయం తెలుసుకున్న విూడియా అక్కడికి వెల్లింది. తనను విూడియా, పోలీస్‌ లు ఎవరు ఏం చేయలేరని ఏం చేసుకుంటావో చేసుకొమ్మని బెదిరింపులకు పాల్పడుతున్నాడని స్రవంతి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు తన భర్త కావాలని స్రవంతి విూడియా ముందు రోదిస్తూ చెప్పింది.