న్యాయవాదులకు హెల్త్ కార్డుల పంపిణీ

మహబుబ్ నగర్ అర్ సి   ,జులై 28 ,(జనంసాక్షి ) :
అడ్వకేట్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం అయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా క్లబ్ లో న్యాయవాదులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు .దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి  అడ్వకేట్ల సంక్షేమం కోసం 100 కోట్ల నిధిని కేటాయించి వారి బాగోగులను చూస్తున్నారని తెలిపారు. దీని ద్వారా ఇప్పటివరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 59,000 మంది అడ్వకేట్ లకు మేలు జరిగిందని, భవిష్యత్తులో కూడా అడ్వకేట్ల సంక్షేమం కోసం మరింత చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశవ్యాప్తంగా అడ్వకేట్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా బెయిల్ తోనే న్యాయవాద వృత్తి ప్రారంభమవుతుందని, అలాంటి బెయిల్  పోలీస్ స్టేషన్ ద్వారా కాకుండా కోర్టు ద్వారానే తీసుకునే విషయమై న్యాయవాదులు కృషి చేస్తున్నారని,అయితే దీనికి సంబంధించి  41(ఏ) సిఆర్పిసికి పార్లమెంటులో సవరణలు చేసేందుకు తమ వంతు  ఎం పి ల మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్  అభివృద్ధిలో భాగంగా పార్కింగ్ కు స్థలము ఇవ్వడం జరిగిందని, ప్రస్తుత స్థలం సరిపోకుంటే మరింత ఇస్తామని తెలిపారు. అంతేకాక నూతన కోర్టు భవనాలకు అవసరమైన స్థలాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, అవసరమైతే  భావన నిర్మాణానికి నిధులను కూడా ఇస్తామని  మంత్రి వెల్లడించారు.జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి, సీనియర్ న్యాయవాది ప్రతాప్ కుమార్ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్లీడర్ మనోహర్,బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులు ఆవేజ్, కో-ఆపరేటివ్ అడ్వకేట్ సొసైటీ అధ్యక్షులు రవికుమార్, మీడియా సెల్ ఇంచార్జ్ కృష్ణ, సీనియర్ న్యాయవాదులు హనుమంతు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సీనియర్  న్యాయవాదులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Attachments area