న్యాయవాదుల విధుల బహిష్కరణ

రక్షణ చట్టం కోరుతూ కలెక్టర్ కు వినతిపత్రం

గద్వాల ఆర్ సి.(జనం సాక్షి) ఆగస్ట్ 16,
నల్గొండ జిల్లాకు చెందిన న్యాయవాది గాడే వి భ్జయ్ రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ గద్వాల బార్ అసోసియేషన్ మంగళవారం కోర్టు విధులను బహిష్కరించింది. ఈ సందర్భంగా బార్ అధ్యక్షులు బి. శోభరాణి, ప్రధాన కార్యదర్శి మండ్ల మధుసూదన్ బాబులు మాట్లాడుతూ విజయ్ రెడ్డి హత్య జరిగాకా దోషులను అదుపులోకి తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందినదన్నారు. సిట్ ను ఏర్పాటు చేసి దోషులకు సత్వరంగా శిక్ష పడేలా చేయాలని వారు డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ లో న్యాయవాదులు రెండు నిముషాలు మౌనం పాటించి విజయ్ రెడ్డి మృతి పట్లా తమ ప్రగాఢ సంతాపాని వ్యక్తం చేశారు. అనంతరం న్యాయ వాదుల రక్షణ చట్టం కోరుతూ గద్వాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు
, కార్యదర్శులు బి శోభరాణి, మండ్ల మధుసూదన్ బాబు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికు వినతిపత్రం అందజేశారు. న్యాయవాదులు గట్టు వామన రావు, పివి. నాగమణి, మల్లారెడ్డిల హత్యలతో పాటు గత నాలుగు రోజులు క్రితం జరిగిన విజయ్ రెడ్డిల దారుణ హత్యలను వారు తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే న్యాయవాదుల రక్షణ కొరకు చట్టం తేవాలని తమ వినతిపత్రంలో కోరారు.