న్యాయ మూర్తుల నియామాకాల్లో ప్రభుత్వ పాత్ర ఉండాలి: సిబల్
ఢల్లీి: ఉన్నత న్యాయస్థానాల్లో పని చేసే న్యాయ మూర్తుల నియామకాలకు ఆచరణలో ఉన్న కొలీజియం విధానం వల్ల ఆశించిన ఫలితం లేదని, నియామాకాల్లో ప్రభుత్వ పాత్ర ఉండలని న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ అభిప్రాయ పడ్డారు. ఈ విషయం పై ఆయన కేబినెట్ నోట్ ఒకటి తయారు చేస్తున్నారు. కొలీజియం వ్యవస్థ స్థానం జుడీఫియల్ అప్పాయింట్ మెంట్ కమిషన్‌ని ప్రవేశ పెట్టడానికి త్వరలో కేబినెట్లో ప్రతిపాదించనున్నట్లు ఆయన తెలిపారు.