పంజాబ్ షరా మామూలే..
మొహాలీ : పంజాబ్‌లో శనివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబార్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సన్ రైజర్స్‌హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 150 పరులు చేసింది. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు తీసి 120 ఓవర్లకు కట్టడి చేసింది. తొలుత టాస్ గెలిచి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సన్‌రైజర్‌స హైదరాబాద్, మ్యాచ్ గెలుపోందింది. పాటిల్, పెరెరా వీరవిహారం చేశారు. పాటిల్ 47బంతుల్లో61 పరుగులు, పెరెరా 19 బంతుల్లో 32 పరుగులతో చెలరేగి ఆడారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బలం బౌలింగ్‌లో కూడా అద్బుతంగా రాణించింది. డారెన్ సమీ అద్బుతమైన బౌలింగ్‌తో కింగ్స్‌ఎలెవన్ పంజాబ్‌నుకట్టడి చేశాడు. నాలుగు ఓవర్లు వేసిన సమ్మి కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. స్టేయిన్, పెరెరా, విహారి అద్బుతమైన బౌలింగ్‌తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను కట్టడి చేశారు. కింగ్స్ ఎలెవన్‌పంజాబ్‌లో పోమర్స్ బాచ్, ఆర్‌సతీష్, మార్ష్ తప్ప ఏ ఓక్కరు రెండంకెల స్కోరు చేయకుండానే పెవిలియన్ బాట పట్టారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలింగ్‌లో శర్మ తప్ప ఏ ఓక్కరు బౌలింగ్‌లో సన్‌రైజర్స్‌ను కట్టడి చేయలేకపోయారు. నాలుగుఓవర్లు వేసిన శర్మ 21 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. గత మ్యాచ్ విజయంతో ఉత్సాహంతో ఉన్న కింగ్స్‌ఎలెవన్ పంజాబ్‌కు బ్రేక్ వేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ను అన్ని విధాల కట్టడి చేసి సన్‌రైజర్స్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాన్ అఫ్ ది మ్యాచను పాటిల్ గెలుపోందాడు.