పంటపొలంలోనే పత్తిరైతు ఆత్మహత్య
హసన్‌పర్తి : వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్ గ్రామంలో చల్ల కుమారస్వామి (42) అనే పత్తిరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నీరు లేక మూడు ఎకరాల పత్తి ఎండిపోవడంతో పంట చేనులోనే పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.