పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి పి వెంకటేశ్వర్లు.

అచ్చంపేట ఆర్సి ,ఆగస్టు 10, (జనం సాక్షి న్యూస్) : మండల పరిధిలోని పల్కపల్లి, చందాపూర్ గ్రామాలలో రైతులు సాగు చేస్తున్న పత్తి పంటలను జిల్లా వ్యవసాయ అధికారి పి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు సాగు చేస్తున్న పంటల నమోదు వివరాలను ఏఈఓ లను అడిగి తెలుసుకున్నారు .అధిక సాంద్రత సాగుపై పత్తి పంటల్లో చీడ పీడ పురుగుల నివారణకై రైతుల కు తగు సూచనలు చేశారు. రైతు బీమా నమోదు చేసుకునే అర్హులైన రైతులు ఈనెల 13 పతేది లోపు చివరి గడువు అని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సహాయ సంచాలకులు ఎం చంద్రశేఖర్ మండల వ్యవసాయ అధికారి కే కృష్ణయ్య ఏఈవోకే లక్ష్మణ్ సింగ్ మరియు రైతులు పాల్గొన్నారు