పంటలను పరిశీలించిన ముత్యాల సునీల్ కుమార్

జూలై    ( జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల్, దోంచంద గ్రామాలను సోమవారం ఆరంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ పంటలను పరిశీలించారు. గతం వారం, పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు వేసిన పంటలు నష్టపోవడమే కాకుండా భూమి కూడా కోతకు గురికావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, పంట నష్టం పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, సునీల్  యువసేన సభ్యులు, తదితరులు  పాల్గొన్నారు.