పంట మార్పిడితో అధిక దిగుబడి
మండల వ్యవసాయ విస్తరణ అధికారి స్వప్న
రైతులు పంట మార్పిడి చేయడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చని మండల వ్యవసాయ విస్తరణ అధికారి స్వప్న తెలిపారు. బుధవారం రోజు మండల కేంద్రంలోని రైతు వేదిక లో నిర్వహించిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి స్వప్న మాట్లాడుతూ రైతులు భూస్వార పరీక్షలు వల్ల తమ పొలంలో ఎరువుల వాడకాన్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చో తెలుస్తుందని, మితిమీరిన ఎరువుల వాడకం ద్వారా పంట దిగుబడి తగ్గుతుందని తెలిపారు. అదేవిధంగా చౌడు, ఆమ్లా నేలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించి, ఫాస్ఫరస్,సాల్యూ బు లైజింగ్ బ్యాక్టీరియా గురించి 30 నుంచి 40 శాతం భాస్వరం ఎరువులు భూమి లోనే నిష్క్రియ రూపంలో మిగిలిపోతాయని వీటిని తిరిగి మొక్కలకు ఉపయోగపడే విధంగా పి ఎస్ బి తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ లింగస్వామి, రైతులు పాల్గొన్నారు.