*పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి సిఐ రాంబాబు*

పెద్దేముల్ ఆగస్టు 27 (జనం సాక్షి)
పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ రాంబాబు పేర్కొన్నారు. శనివారం నాడు పెద్దేముల్ మండల కేంద్రంలో వినాయక చవితి సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రజా ప్రతినిధులతో, యువజన సంఘాలతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూర్ రూరల్ సీఐ రాంబాబు మాట్లాడుతూ… గ్రామాలలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటిస్తూ వినాయక చవితి పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా గ్రామాలలో యువజన సంఘాలు, అన్ని మతాల మత పెద్దలు కలిసి పండుగను జరుపుకోవాలని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీస్ స్టేషన్ నిబంధనల ప్రకారం మంటపాలను ఏర్పాటు చేసుకొని పోలీసు నిబంధనలు పాటించాలని తెలిపారు. విద్యుత్ శాఖ వారి పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అనవసరమైన వదంతులను పుకార్లలను నమ్మొద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దేముల్ ఎస్సై రవూఫ్, జడ్పిటిసి ధారాసింగ్ నాయక్, ఎఫ్ఎసిఎస్ చైర్మన్ ద్యావరీ విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బలవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఆయా గ్రామాల మత పెద్దలు, యువజన సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.