పండుగ వాతావరణం లో ఫ్రీడమ్ కప్ ముగింపు వేడుకలు
పండుగ వాతావరణం లో ఫ్రీడమ్ కప్ ముగింపు వేడుకలు నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా స్థానిక ఎన్.టి.ఆర్. స్టేడియంలో గురువారం నిర్వహించిన ఫ్రీడమ్ కప్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎం.డేవిడ్, ఏ.ఎస్పీ యోగేష్ గౌతం లతో కలిసి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగులకు, యువతకు 11, 12 తేదీల్లో గ్రామ స్థాయిలో, ఆ తర్వాత మండల స్థాయి లో ఆట స్థలాల్లో క్రీడా పోటీలు నిర్వహించి జిల్లా స్థాయికి రావడం జరిగిందని, ఈ రోజు ఫైనల్ తో పాటు, ఫ్రీడమ్ కప్ ముగింపు పోటీలు వేడుకలు నిర్వహించు కుంటున్నామనీ, 200 ఏళ్ళ విదేశీ పాలన నుండి విముక్తి పొంది స్వాతంత్ర్య దేశంలో మనకు నచ్చిన విధంగా ఉంటున్నామని, దీని వెనక ఎందరో మహానుభావుల కృషి ఉన్నదని, వారందరిని మననం చేసుకొని వారి స్ఫూర్తి తో ముందుకు వెళ్లాలని, వారి గురించి భావి తరాలకు తెలపాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు వారాల పాటు జాతీయత పెంపొందే విధంగా కార్యక్రమాలు నిర్వహించు కుంటున్నామాని, క్రీడా పోటీల్లో మహిళలు ఎక్కువగా పాల్గొన్నారని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖలు పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వ ఉదేశ్యం అని, ఉద్యోగులు మానసికంగా, ఆరోగ్యంగా మెరుగుగా ఉండే విధంగా ఖచ్చితంగా ఏదో ఒక హాబీ అలవాటు చేసుకోవాలని, ఉద్యోగులు ఆడతారు, పాడతారు, సంతోషంగా ఉంటారని అనుకోవలని, ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఈవెంట్ లో పాల్గొనాలని, వంటికి ఎండ, కాలికి మట్టి తగల నివ్వలని తెలిపారు. విద్యార్థినులకు, కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు చేసినందుకు, ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధులు గురించి, ఫ్రీడమ్ సాధనలో మహానుభావుల కృషి గురించి మన భవిష్యత్ తరాలకు తెలపాలని, నిత్య జీవితంలో క్రీడలను భాగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్, ఎం.డేవిడ్, అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతం లు మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. శశాంక, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఏ.ఎస్పీ యోగేష్ గౌతం లు పాటలు పాడి అందరిలో జోష్ నింపి అందరినీ అలరించారు. వివిధ శాఖల ద్వారా, జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముందుగా డి.ఆర్.డి. ఏ. ఉద్యోగిని ఉమా పాడిన భక్తి గీతం ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు. వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్, ఎం.డేవిడ్, ఏ.ఎస్పీ యోగేష్ గౌతంలు మెమొంటోలు, మెడల్ లను, ప్రశంసా పత్రాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్, ఎం.డేవిడ్ లతో, ఏ.ఎస్పీ. యోగేష్ గౌతం, డి.ఎస్పీ సదయ్య, ప్రజా ప్రతినిధులు, ఆర్డీవో కొమురయ్య, జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, ప్రజలు, వివిధ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.