పంపిణి చేసిన ప్రతి మొక్కను కాపడాలి సర్పంచ్ లావణ్య

లింగంపేట్ 19 (జనంసాక్షి)
లింగంపేట్ మండలకేంద్రంలో మంగళవారం హోమ్ సీడ్ మొక్కలను సర్పంచ్ బొల్లు లావణ్య ఇంటింటికి పంపిణి చేసినట్లు కార్యదర్శి విఠల్ తెలిపారు.ప్రతి కుటుంబానికి 6 మొక్కలు ఇస్తున్నామన్నారు.అందులో కరివేపాకు నిమ్మ,జామ,గులాబీ, మందారం,తులసి మొక్కలు ఉన్నాయని తెలిపారు.ఐకేపీ సిబ్బంది మహిళ సంఘాల వివోఏ లతో కలిసి ఇంటింటికి వెళ్లి ఇవ్వడం జరుగిందన్నారు.ప్రతిమొక్కను కాపాడు కోవాలని సర్పంచ్ వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు అంజద్, లక్ష్మీ రమేష్,సమల రేఖ లింగం ఐకేపీ సిబ్బంది.అశోక్,అంజయ్య పాల్గొన్నారు.