పచ్చనిచెట్లతోనే మనకు ఆరోగ్యం

మొక్కలు నాటాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ
మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి

గుంటూరు,ఆగస్ట్‌5( జనంసాక్షి):ర్యావరణ సమతుల్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నాడు`నేడు పథకంలో భాగంగా స్కూళ్లు, ఆస్పత్రుల్లో మొక్కలు నాటాలని ఆయన పిలుపు నిచ్చారు. పచ్చదనం పెంపొందించడం, అడవుల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితం కల్పించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందులో భాగంగా మన రాష్ట్రంలో 23 శాతం ఉన్న అటవీ విస్తీరణం 33 శాతం పెంచడానికి ప్రయత్ని స్తున్నాం. మన రాష్ట్రం అటవీ విస్తరణలో దేశంలో రెండో స్ధానంలో ఉంది, దానిని మొదటి స్ధానంలోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నాం. దీనికి తోడు అటవీ శాఖ జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం ద్వారా వివిధ శాఖల ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాలు చేస్తున్నాం, దీంతో పాటు నాడు`నేడు కార్యక్రమం, జగనన్న కాలనీలలో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ప్రతీ విషయానికి ఎల్లో విూడియా దుర్మార్గంగా వక్రీకరిస్తుంది. సీఎం వైఎస్‌ జగన్‌పై ఎంత బురదచల్లినా ప్రజల మనసులో ఆయన చిరస్ధాయిగా నిలిచి పోయారు. అదే టీడీపీ ప్రభుత్వంలో కోట్లు అప్పులు చేసినా ఎల్లో విూడియాకు కనిపించలేదు కానీ, సీఎం జగన్‌ చేస్తోన్న అభివృద్ది, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక పచ్చ పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయి. కోవిడ్‌ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రతీ కార్యక్రమం కూడా చెప్పిన తేదీకే అమలు చేస్తూ పాలన సాగిస్తున్నారని‘ మంత్రి బాలినేని అన్నారు. ªూష్ట్రంలోవృక్షంలా తయారయ్యేందుకు అందరూ కృషిచేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లేలా మనం రాష్ట్రంలో ప్రతీ రోజూ వీలైనంత మేరకు మొక్కలు నాటాలన్నారు. వాతావరణ సమతుల్యం, వాతావరణ కాలుష్యం తగ్గడానికి, ఆక్సీజన్‌ అవసరం కూడా తెలుసుకున్నాం. కాబట్టి, మొక్కలు, వృక్షాలు అనేది మానవ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మనం తలంచి మొక్కలు విరివిగా పెంచాలని ఆయన పిలుపునిచ్చారు.