పచ్చి రొట్ట ఎరువులైన జిలుగు పై అవగాహన.

 

మల్లాపూర్ ,(జనంసాక్షి) ఆగస్టు:06 మండలంలోని సాతరం గ్రామలలో శనివారం బాస్వరాన్ని కలిగించే బ్యాక్టీరియా వాడకంపై మరియు పచ్చి రొట్ట ఎరువులై న జిలుగా పై అవగాహన కల్పిస్తున్న ఎ.ఇ.ఓ శైప్రియ

భాస్వరం అనేది ఒక ప్రధాన పోషకం .ఇది పంట పెరుగుదలకు వేర్లు వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది .
రైతులు భాస్వరాన్ని డిఏపి కాంప్లెక్స్ ఎరువుల రూపంలో వినియోగిస్తారు. భాస్వరం పోషకాన్ని భూమిపై చల్లినప్పుడు అది మొక్కలకు అందుబాటు కానీ రూపంలోకి మారిపోతుంది భాస్వరాన్ని కలిగించే జీవన ఎరువు వాడకం రైతులకు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది మొదటిది సాగు ఖర్చు తగ్గుతుంది రెండవది నేల భౌతిక లక్షణాలను పునరుద్ధరిస్తుంది .ఈ భాస్వరాన్ని కలిగించే బ్యాక్టీరియాని ఉపయోగించడం వలన లభ్యం కానీ రూపంలో ఉన్న భాస్వరాన్ని లభ్య రూపంలోకి మార్చి మొక్కలకు అందిస్తాయి. ఒక కేజీ ప్యాకెట్ వాడితే హెక్టార్కు ఒక బ్యాగ్ డీఏపీ వినియోగాన్ని ఆదా చేసుకోవచ్చు ఈ బ్యాక్టీరియాను అన్ని పంటలకు వినియోగించవచ్చు. జనుము ను పూత దశ లోనే దున్ని వేయాలి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోడ్డుసుమాలత రాజేష్ ఎంపీటీసి గున్నల శ్రీనివాస్ రైతులు పంది ధర్ముపురి వూడుగుల గంగారాజం,జంబుక గంగారాజం అచ్చ పెద్దరాజం తదితరులు పాల్గొన్నారు.