పట్టణ ప్రగతి ద్వారా వేగంగా అభివృద్ధి పనులు. వార్డు ప్రజలు పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకండి వ్యాధులు వ్యాపించే ప్రమాదం.

వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు.
తాండూరు జూన్ 13(జనంసాక్షి)తెలంగాణ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధే దేయంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టణప్రగతి 4వ విడత 11వ రోజులో బాగంగా సోమవారం సాయి పూర్ 9వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమె  మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు వ్యయ ప్రణాళికలు సిద్ధం చేసి ఆయా పనులు త్వరలోనే చేపట్టి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.పట్టణ ప్రజల ద్వారా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో వార్డు అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. హరితహారం ద్వారా ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నమని తెలిపారు. ఇండ్ల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. మురుగు కాలువలు, రోడ్లు శుభ్రంగా చేయించడం, ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు.వార్డులో సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు, ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని వారు కోరారు, సమస్యల పరిష్కారం దిశగా పని చేస్తామన్నారు.చెత్త ఎక్కడికక్కడే పడేయడం వలన వ్యాధుల బారిన పడే అవకాశం వున్నందున  తడి చెత్త, పొడి చెత్త వేరుగా వేయాలన్నారు. చెత్త ని తడి పొడి చెత్త గా విభజించి మున్సిపల్ వాహనానికి అందించాలని కోరారు…పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో వి.ఆర్.ఒ స్వప్న, స్పెషల్ ఆఫీసర్ వి.ఆర్.ఐ రమేష్,ఆర్పీ సైరభాను, అంగన్వాడీ టీచర్ నవీణా,ఆశావర్కర్ అనితా తదితరులు పాల్గొన్నారు.