పట్టాలకెక్కని సేంద్రియ ఎరువుల తయారీ ప్రాజెక్టు
హైదరాబాద్,డిసెంబర్17(జనంసాక్షి): కూరగాయాల వ్యర్థాలతో జిహెచ్‌ఎంసి సహకారంతో సేంద్రియ
ఎరువుల తయారికీ చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రకటించినా ఆ ప్రాజెక్ట్ ఇంకా పట్టాలపైకి ఎక్కలేదు. సేంద్రీయ ఎరువుల తయారీకి శ్రీకారం చుడతామని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్‌రావు గతంలోనే తెలిపారు. ఈ మేరకు పరిశోధనలు చేస్తున్నామని అన్నారు. యితే ఇది ఓ కొలిక్కి రావాల్సి ఉంది. కూరగాయల మార్కెట్లలో వెలువడుతున్న వ్యర్థాలను విశ్వవిద్యాలయానికి ఇచ్చే వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలో సేంద్రీయ ఎరువుల తయారీకి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని వీసీ చెప్పారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని వర్సిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మార్కెట్ల నుంచి వ్యర్థాలను సేకరించి నేరుగా వర్సిటీకి తరలించేలా ఏర్పాట్లు చేయాలని గ్రేటర్ అధికారులను కోరారు. నగరంలో కూరగాయల వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు ముందుకు రావడంతో సమస్య తీరుతుందని భావిస్తున్నారు. కూరగాయల వ్యర్థాలతో వర్మికంపోస్టు తయారు చేసే విధానంపై చర్చించారు. నగరంలో పలు ఈ సేంద్రీయ ఎరువులను రైతులకు తక్కువ ధరకు సరఫరా చేస్తామన్నారు. ప్రస్తుతం దక్షిణమండలం పరిధిలోని మర్కెట్ల నుంచి రోజుకు 20 టన్నుల వ్యర్థాలు వస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా కూరగాయాల మార్కెట్‌ల నుంచి వ్యర్థాలను సేకరిస్తున్నామని, ప్రస్తుతం అవి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పారు. ఇక నుంచి విశ్వవిద్యాలయం అధికారులు సూచించిన స్థలంలో తెచ్చి వేసేలా ఏర్పాట్లు చేస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. అయితే దీనిపై ఇంకా కార్యాచరణ జరగలేదు.