పట్టిసీమతో ఫలాలు అందాయి

ఎపి రోల్‌ మాడల్‌గా నిలిచింది: ఎంపి

ఏలూరు,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి ): ప్రతిపక్షాలు వట్టిసీమని ఎద్దేవా చేసిన నేడు అదే పట్టిసీమ డెల్టా రైతాంగానికి జీవనాధరామైందని ఏలూరు ఎంపి మాగంటి బాబు అన్నారు. దేశంలోనే నదులను అనుసంధానం చేసినఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. గోదావరి జలాలను కృష్ణా నదిలోఅనుసంధానం చేయడం వల్ల నేడు డెల్టా రైతాంగానికి లబ్ది చేకూరుతుందన్నారు. సాగుపై పూర్తిగా ఆశలు కోల్పోయిన డెల్టా రైతాంగానికి పట్టిసీమ ఊపిరి పోస్తుందన్నారు. సాగునీటిని రైతాంగానికి అందించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నదుల అనుసంధానం ద్వారా డెల్టా రైతాంగానికి నీటిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి పట్టిసీమప్రాజెక్టును తీసుకు వస్తే, అప్పుడు ఎద్దేవా చేసిన వారే, ఇప్పుడు నోరుమూసుకున్నారన్నారు. యుద్దప్రాతిపదికన ప్రాజెక్టు పనులు పూర్తి చేసిప్రకటించిన తేదిన నీరు విడుదల చేయడం, డెల్టారైతాంగం పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ది తేటతెల్లం చేస్తుందన్నారు. డెల్టా ప్రాంతానికి పట్టిసిమ ప్రాజెక్టు వరప్రదాయనిగా పేర్కొన్నారు. చంద్రబాబు దూరదృష్టితో పట్టిసీమ ప్రాజెక్టును డిజైన్‌ చేసి డెల్టా రైతాంగానికి నీరు అందించడానికి చేసిన కృషి మరువలేనిదన్నారు. బాబుకు డెల్టా రైతాంగం రుణపడి ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటుందన్నారు. కేంద్రం పెద్దన్నలాగా వ్యవహారించి రాష్ట్రాల మధ్య నీటి తగాదాలను పరిష్కరించాల్సిన అవసరంఉందన్నారు. లేకపోతే నీటి యుద్దాలు సంభవించే దుస్థితి ఎదురవుతుందన్నారు. నీటి వివాదాలను పరిష్కరించడానికి కేంద్రం ప్రత్యేక బోర్టును ఏర్పాటుచేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేయడానికి కేంద్రంపై తెలుగుదేశం ప్రభుత్వం తరుపున ఒత్తిడి తెస్తున్నట్లు ఎంపి పేర్కొన్నారు.

తాజావార్తలు