పత్తిమిల్లులో భారీ అగ్నిప్రమాదం
వరంగల్ రాయపర్తి మండలంలోని మురిపిరాల భాగ్యలక్ష్మి పత్తిమిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తోంది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం తెలిసింది.