పత్తిలో సస్యరక్షణ చర్యల పై రైతులకు అవగాహన

ఇటిక్యాల (జనంసాక్షి) జులై 29 : మండల పరిధిలోని వేముల గ్రామంలో అలంపూర్ సహాయ వ్యవసాయ సంచాలకులు సక్రియ నాయక్ ఆధ్వర్యంలో పంట నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా శుక్రవారం వర్షాకాలంలో 2022 సంబంధించిన వివిధ పంటలను నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్లో క్షేత్ర స్థాయిలో పంటలను రైతుల సమక్షంలో ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం పత్తి పంటలో సస్యరక్షణ చర్య, రసం పిలిచిన పురుగుల నివారణ గురించి రైతులకు సలహాలు సూచనలు చేశారు. అలాగే ప్రస్తుతం పత్తిలో పేను బంక నివారణకు ప్రొఫెనాపోస్ మందును రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ కి చొప్పున కలిపి వారానికి ఒకసారి పిచీకరి చేసుకోవాలని రైతులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఏఈఓ సురేష్ కుమార్ మరియు రైతులు పాల్గొన్నారు.