పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి.

  అదనపు కలెక్టర్ పి. రాంబాబు.
  నిర్మల్ బ్యూరో, అక్టోబర్18,జనంసాక్షి,,,  జిల్లా పాలనాదికారి  సమావేశం  మందిరంలో  మంగళవారం పత్తి కొనుగోలు పై  అదనపు కలెక్టర్   పి. రాంబాబు  అధ్యక్షతన పత్తి కొనుగోలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా  రాబోవు ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కు సంబంధించి ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులకు పత్తి కొనుగోలు సజావుగా జరుకుటకై తగు సూచనలు సలహాలు ఇవ్వడం  జరిగింది.దళారుల భారీ నుండి రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రతి రైతు పండించిన పంటకు మద్దతు ధర పొందేలా చూడాలని అన్నారు. పత్తి మహారాష్ట్రకు తరలిపోకుండా చూడాల్సిన బాధ్యత జిన్నింగ్ మిల్లు యజమానులపై అధికారులపై ఉందన్నార. పత్తి కొనుగోలులో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు.అనంతరం గోడప్రతులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి సయ్యద్ అశ్వక్ అహ్మద్ ,మార్కెటింగ్ శాఖ కార్యదర్శిలు, సిసిఐ అధికారులు, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులు లీగల్ వెంట్రాలజీ అధికారులు, మరియు నిర్మల్ జిల్లా జిన్నింగ్ మిల్ యాజమానులు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు