పత్తి విత్తనాలకు కృత్రిమ కొరత … బ్లాక్ మార్కెట్లో విక్రయాలు !
తీ మార్కెట్లో పత్తి విత్తనాలకు కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు
తీ 930 రూపాయల మహికో పత్తి విత్తనాలు 1800 లకు విక్రయిస్తున్న వ్యాపారులు
తీ నాగపూర్, బల్లార్షా, చంద్రాపూర్ నుంచి పత్తి విత్తనాల దిగుమతి
తీ మహబూబ్‌నగర్ నుండి జోరుగా నకిలీ విత్తనాల దిగుమతి
తీ ముంచుకొస్తున్న ఖరీఫ్ తీ పట్టించుకోని అధికారులు
బోయినిపల్లి, జూన్ 5 (జనంసాక్షి) : పత్తి రైతుల కష్టాలు మొదలయ్యాయి. ముంచుకొస్తున్న ఖరీఫ్ సీజన్‌కు ముందే పత్తి విత్తనాల బ్లాక్ దందా ప్రారంభమయింది. సాధారణంగా వర్షాభావం, చీడపీడలు, ఎరువులు సకాలంలో అందకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్న రైతులకు ఈ సీజన్‌లో విత్తనాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. గత ఏడాది ప్రభుత్వ నిర్వాకం కార ణంగా విత్తనాల పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కేవలం కొన్ని రకాల విత్తనాలే దిగు బడి బాగా వస్తుందని వ్యాపారులు ప్రచారం చేయ డంతో పాటు ఆ రకాలకు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్మి సొమ్ముచేసుకున్నారు. అలా గే సకాలానికి మార్కెట్లో నాణ్యత గల విత్తనాలు లభించకపోవడంతో గత సంవత్సరం రైతులు పలు ఇబ్బందులు ఎదుర్కున్నారు. అయితే రైతుల ఇబ్బందులను గమనించి అధికారులు డిమాండ్ ఉన్న విత్తన రకాలను, పత్తి ఎక్కువగా సాగుచేసే ప్రాధాన్య గ్రామాలను గుర్తించి ఒక్కో రైతుకు ఒక్కో ప్యాకేట్ అందేలా పర్మిట్లు ఇచ్చి పంపిణీ చేశారు. అయినా రైతులకు పడిగాపులు తప్పలేదు. తెల్లారే సరికి వరసలో నిలబడి అర్ధరాత్రి వరకూ నిరీక్షిం చిన రైతలు పడరానిపాట్లు పడ్డారు. దీంతో భారీ బందోబస్తుల మధ్య విత్తనాల పంపిణీ చేయాల్సి వచ్చింది. కాగా గత సంవత్సరం ఎదురైన అనుభ వాలను దృష్టిలో ఉంచుకొని బాధ్యతగా వ్యవహ రించాల్సిన ప్రభుత్వం గానీ వ్యవసాయాధికారులు గానీ ఇంతవరకూ నాణ్యమైన విత్తనాల సరఫ రాపై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. డిమాండ్ ఉన్న రకాలను ఎలా, ఎప్పుడు పంపిణీ చేయాలనే నిర్ణయాలు తీసుకోలేదు. అదేమంటే అన్నిరకాల విత్తనాలు దుకాణాలలో లభ్యమవు తున్నాయని అంటున్నారు. కానీ దుకాణాలలో డిమాండ్ ఉన్న విత్తనాలు రైతులకు వివిధ రకాల విత్తనాలతో పాటు మైకో 7351 ఒక్కో బస్తా 930 రూపాయలకు విక్రయించాల్సి ఉండగా 1800 రూపాయలకు, మార్వెల్ 1200, అజీత్ 1200, జాక్‌పాటు వేయి రూపాయల చొప్పున విక్రయిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్కెట్లో నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు నాణ్యమైన విత్తనాలకు కృత్రిమ కొరతను సృష్టిస్తూ, అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై దృష్టిపెట్టి రైతులు నష్ట పోకుండా చూడాలని పలువురు రైతులు కోరుతున్నారు.