పదవుల కోసం పాకులాడే…..

నిజామాబాద్ బ్యూరో,నవంబర్ 18(జనంసాక్షి):                                         పదువుల కోసం తాను పాకులాడటం లేదనీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూపతి రెడ్డి స్పష్టం చేశారు. టీఆరెస్ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని వదులుకోవటానికి సిద్ధం అన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీ లో కొనసాగుతున్నారో చెప్పాలన్నారు. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే
బాజిరెడ్డి గోవర్ధన్  ఏ రోజు తెలంగాణ ఉద్యమం లో పాల్గొనలేదన్నారు. తాను తెలంగాణ ఉద్యమం లో ప్రత్యక్షముగా పాల్గొనటం జరిగిందనీ గుర్తు చేసారు. బాజిరెడ్డి కనీసం జై తెలంగాణ కూడా అనలేదన్నారు. కేసీఆర్
తెలంగాణ ద్రోహులను పక్కన చేర్చుకున్నారనీ మండి పడ్డారు. ఈ ఎన్నికల్లోటీఆరెస్ పార్టీ కి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. మిషిన్ భగీరథ నీళ్లు ఇస్తామని చెప్పి మోసం చేసారని,  నీళ్లు ఏ గ్రామం ఇచ్చారో చెప్పాలన్నారు.
కూటమి వల్ల నిజామాబాద్ రూరల్ ప్రకటన ఆలస్యంగా అయిందన్నారు. నా ప్రచారానికి 15 రోజులు చాలు అనీ వెల్లడించారు. పోలీసు, రెవెన్యూ అధికాలరులు ఎన్నికల్లో నిష్పక్ష పాతంగా వ్యవహరించాలన్నారు.
రూరల్ నియోజకవర్గములో కులసంగలతో యథేచ్ఛగా మీటింగ్ లు పెడుతున్నారనీ,
ఎన్నికల ఉల్లంఘన కిందకు రాదా అనీ ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిపేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నరని మండి పడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని పథకాలు  యధావిధిగా కొనసాగిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో అమృత పూర్ గంగాధర్, పార్శి చంద్రశేఖర్ గౌడ్ , గంగారెడ్డి యాదగిరి నాయకులు కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు