పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

• ఆ దిశగా ప్రధానోపాధ్యాయులుకృషి చేయాలి

• విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలి

• వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

•వంద శాతం ఫలితాలు సాధించేలా కలిసికట్టుగా పనిచేయాలి, 90 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక విడుదల

•కలెక్టర్‌ పి ఉదయ్ కుమార్

నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో నవంబరు5జనంసాక్షి:
పదోతరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి అగ్ర స్థానంలో నిలువాలని కలెక్టర్‌ పి. ఉదయ్ కుమార్ అధికారులకు సూచించారు.
శనివారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ పి.
ఉదయ్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ…..
ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక గంట ప్రత్యేకతలను పకడ్బందీగా నిర్వహించి, విద్యార్థులకు సబ్జెక్ట్‌ వారీగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వారిని రానున్న పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు.
2023 మార్చి నెలలో 10వ తరగతి పరీక్షలు ఉంటాయన్నారు. జిల్లాలో మొత్తం (ప్రైవేట్‌, ప్రభుత్వ, ఇతర గురుకులాల) పాఠశాలలు 245 ఉన్నాయన్నారు.
ఈ విద్యా సంవత్సరం 10వ తరగతిలో విద్యార్థులు 10వేల 31 మంది ఉన్నారన్నారు.
జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పదవ తరగతి 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను అందజేయాలని అధికారులకు సూచించారు.
అన్ని పాఠశాలల్లో ప్రణాళికాబద్ధంగా ప్రత్యేక తరగతులు నిర్వహించి,
వారికి పరీక్షలపై అవగాహన కల్పించి, వారిలో భయాన్ని తొలగించాలన్నారు. విద్యార్థుల హాజరు శాతంపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వారు ఎందులో వెను కబడి ఉన్నారో ఆ సబ్జెక్ట్‌పై ప్రత్యేక దృష్టి ఉంచి బోధన చేపట్టాలన్నారు. నాణ్యమైన విద్య ద్వారానే విద్యార్థులకు బంగారు భవిష్యత్‌ ఉంటుందన్నారు. నూరు శాతం ఫలితాలు వచ్చేలా కలిసి కట్టుగా పనిచేయాలన్నారు.
ప్రత్యేక తరగతులను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, పిడి డిఆర్డిఏ నర్సింగరావు, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్ రావు, సెక్టోరల్ అధికారి వెంకటయ్య, డిసిఈబి అదనపు కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, స్ట్రాంగ్ టీచర్ వెంకటేశ్వర్ల శెట్టి, పాల్గొన్నారు.