పద్మశాలి సంఘం అధ్వర్యంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం.

నేరేడుచర్ల జనంసాక్షి న్యూస్.జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేరేడుచర్ల  పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో,జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా పద్మశాలి సంగ జెండాను పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి యరమాద గిరి, ఆవిష్కరించారు.అనంతరం సీఎం కేసిఆర్ నేతన్న బీమా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.పద్మశాలి సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు, గ్రంధాలయం చైర్మన్ గుర్రం మార్కండేయ ఆధ్వర్యంలో,సీఎం కేసిఆర్,మంత్రి జగదీశ్వర్ రెడ్డి ,ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా చేనేతకు నేతన్న భీమా ప్రకటించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని,టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేత కార్మికుల కొరకు వివిధ పథకాలు పెట్టి కెసిఆర్ ఆదుకుంటున్నారని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేనేత వస్త్రాలపై జిఎస్టి పెట్టి నేతన్నల నడ్డి విరిచాడు తక్షణమే చేనేత వస్త్రాలపై జీఎస్టీ ని రద్దు చేయాలని డిమాండ్ చేశాడు .ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ముశం నరసింహ,మండల ఉపాధ్యక్షులు,నక్క గిరి,ఏలే లక్ష్మణ్,ఆర్గనైజర్ సెక్రెటరీ రావిరాల యుగంధర్,మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి నరసింహ,బాలెన సైదులు,పద్మశాలి సంఘం నాయకులు,అక్కలదేవి రవి,నక్క శ్రీను,కొంగరి శ్రీను,రెబ్బ సత్య నారాయణ,యరమాద చంద్రమౌళి,గూడూరు చంద్రయ్య,రెబ్బ ఆదినారాయణ, రావిరాల నరేష్,చిట్యాల మధు, చిట్టిపోలు వేణు,బొట్టబత్తిని కృష్ణ,విప్ప నాగరాజు తదితరులు ఉన్నారు..
 

తాజావార్తలు